ఎమ్మెల్యే ఇంటి మీద దాడి అమానుషం
Published on 20 Mar 2026, 01:45 PM 28
JH-38917
జనహితం న్యూస్: తుంగతుర్థి ఎమ్మెల్యే మందుల శామ్యూల్ గారిపై ఇటీవల తీవ్రమైన పదజాలం తో దూషిస్తూ మానసిక దాడి అలాగే వారి నివాసంపై జరిగిన దాడి ఘటనలను మాదిగ జాగృతి సంఘం తీవ్రంగా ఖండిస్తోంది. ఈ సందర్భంగా మాదిగ జాగృతి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు భీంరావ్ మహారాజ్ మాట్లాడుతూ
ఒక మాదిగ జాతి ప్రజాప్రతినిధి అనే ఉద్దేశంతోనే తన పై ఈ దాడి జరిగిందని మేము భావిస్తున్నాము. తీవ్రమైన పదజాలంతో దుర్భాషలాడుతూ ఇంటి పై దాడి చేసారు, ఒక MLA అయినప్పటికీ తనపైనే దాడి జరిగింది అంటే మరి సామాన్యులైన మాదిగల పరిస్థితి ఏంటి.. ఇది అత్యంత ఆందోళనకరమైన విషయం. ఇది కేవలం వ్యక్తిగత భద్రతకు మాత్రమే కాకుండా, ప్రజాస్వామ్య వ్యవస్థకు కూడా తీవ్రమైన ముప్పు ఉంది. ఇలాంటి హింసాత్మక చర్యలు సమాజంలో భయాందోళనలు సృష్టిస్తాయి అని అన్నారు. దళిత నాయకులపై ఈ విధమైన దాడులు అసహ్యకరమైనవి, అంగీకరించలేనివి. ఈ ఘటన వెనుక ఉన్న దుండగులను వెంటనే అరెస్ట్ చేసి, కఠినమైన చట్టపరమైన చర్యలు వెంటనే తీసుకోవాలని మాదిగ జాగృతి సంఘం ప్రభుత్వాన్ని కోరుతుంది.
ఒక అధికార పార్టీ దళిత ఎమ్మెల్యే కి ఇంత ఘోరమైన అవమానం జరుగుతుంటే ముఖ్యమంత్రి స్పందించకపోవడం చాలా దారుణం అని అన్నారు. మందుల శామ్యూల్ గారికి తగిన భద్రత కల్పించడంతో పాటు, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాము అని అన్నారు. ఈ యొక్క కార్యక్రమంలో మాదిగ జాగృతి సంఘం నాయకులు లింగస్వామి మహారాజ్, రాములు మహారాజ్ మరియు తదితర నాయకులు పాల్గొన్నారు.
