హోమ్ హైదరాబాద్‌ జాతీయం అంతర్జాతీయం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ క్రీడలు ఎడ్యుకేషన్ & కెరీర్‌ బిజినెస్ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ క్రైమ్‌ సంపద వ్యవసాయం సినిమా ఈ-పేపర్
చిల్లర రాజకీయాలు మానుకోండి అభివృద్ధి విషయంలో మాతో పోటీపడండి -  ఎల్.బి.నగర్ MLA దేవిరెడ్డి సుధీర్ రెడ్డి JH-96173

జనహితం న్యూస్ హైదరాబాద్: ఎల్.బి.నగర్ నియోజకవర్గంలో నిన్న యూత్ కాంగ్రెస్ నాయకులు ‘డ్రగ్ టెస్ట్’ పేరిట ‘వైట్ ఛాలెంజ్’ ప్రకటించి, అంబేద్కర్ విగ్రహం వద్దకు రావాలని మీడియా ద్వారా పిలుపునిచ్చిన నేపథ్యంలో, ఎల్.బి.నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గారు, బీఆర్ఎస్ నాయకులతో కలిసి అక్కడికి చేరుకున్నారు, అయితే కాంగ్రెస్ నాయకులు పోలీసులను అడ్డుపెట్టుకుని బీఆర్ఎస్ నాయకులను అంబేద్కర్ విగ్రహం వద్దకు వెళ్లనీయకుండా అడ్డుకోవడం దురదృష్టకరమని విమర్శించారు.

ఇది వారి ద్వంద్వ వైఖరికి, చిల్లర రాజకీయాలకు నిదర్శనమని పేర్కొన్నారు,సవాళ్లు విసిరిన తర్వాత వాటికి సమాధానం చెప్పేందుకు వెనక్కి తగ్గడం కాంగ్రెస్ నాయకుల వైఫల్యాన్ని చూపుతోందని అన్నారు. స్వయంగా ఎమ్మెల్యే గారు తమ అనుచరులతో కలిసి శాంతియుతంగా డ్రగ్ టెస్ట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ, అధికార అహంకారంతో పోలీసు బలగాలను ఉపయోగించి అడ్డుకోవడం తగదని విమర్శించారు.

ఎల్.బి.నగర్‌లో ఇంతవరకు లేని విధంగా ఉద్రిక్తతలు సృష్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయని, ప్రాంతానికి సంబంధం లేని వ్యక్తులు ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు, సవాళ్లు విసిరిన తర్వాత కార్యకర్తలకు అండగా నిలవకపోవడం బాధాకరమని అన్నారు,తాము ఎప్పుడైనా, ఎక్కడైనా డ్రగ్ టెస్ట్‌కు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. తమతో ఉన్న కార్యకర్తలపై పూర్తి విశ్వాసం ఉందని, వారికి ఎలాంటి దురలవాట్లు లేవని అన్నారు, డ్రగ్స్ సంస్కృతిని తమ పార్టీ ఎప్పటికీ ప్రోత్సహించదని తెలిపారు.

అలాగే తమ నాయకుడు కేటీఆర్ గారిపై చేసిన డ్రగ్స్ ఆరోపణలు కూడా నిరాధారమని, ఆయన కూడా ఎప్పుడైనా పరీక్షలకు సిద్ధంగా ఉన్నారని గుర్తుచేశారు, అయినప్పటికీ కాంగ్రెస్ నాయకులు స్పందించకుండా మౌనం వహిస్తున్నారని విమర్శించారు, యువత డ్రగ్స్ బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలని పిలుపునిచ్చారు, ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు, డివిజన్ అధ్యక్షులు, మహిళలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Click to join Whatsapp channel
Janahitham News
చిల్లర రాజకీయాలు మానుకోండి అభివృద్ధి విషయంలో మాతో పోటీపడండి - ఎల్.బి.నగర్ MLA దేవిరెడ్డి సుధీర్ రెడ్డి
చిల్లర రాజకీయాలు మానుకోండి అభివృద్ధి విషయంలో మాతో పోటీపడండి -  ఎల్.బి.నగర్ MLA దేవిరెడ్డి సుధీర్ రెడ్డి

→ గోనె సాయిలు - ఎడిటర్‌ / సీనియర్ రిపోర్టర్