హోమ్ హైదరాబాద్‌ జాతీయం అంతర్జాతీయం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ క్రీడలు ఎడ్యుకేషన్ & కెరీర్‌ బిజినెస్ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ క్రైమ్‌ సంపద వ్యవసాయం సినిమా ఈ-పేపర్
బాన్సువాడ అల్లర్ల బాధితులకు ఎంఐఎం అండ.. కన్నీళ్ల మధ్య ఆశ నింపిన నేతలు JH-43161

జనహితం న్యూస్, బాన్సువాడ: కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో అల్లర్ల వల్ల ఆస్తి నష్టపోయి, ఉపాధి కోల్పోయిన బాధితులకు ఎంఐఎం పార్టీ ద్వారా ఆర్థిక భరోసా కల్పించడంలో ఎంఐఎం కామారెడ్డి జిల్లా సెక్రటరీ బాన్సువాడ పట్టణ అధ్యక్షుడు సయీద్ ఖాన్, జిల్లా జాయింట్ సెక్రటరీ అబ్దుల్ లయాక్ మరియు 17వ వార్డు కౌన్సిలర్ ఫరానాజ్ అబ్దుల్ లయాక్ చేసిన కృషిని బాధితులు కొనియాడారు. తమ కష్ట కాలంలో కొండంత అండగా నిలిచిన ఈ నేతలకు కృతజ్ఞతగా శుక్రవారం బాధితులు వారిని ఘనంగా సన్మానించారు.

ముఖ్య నేతల నిరంతర శ్రమ - కౌన్సిలర్ కీలక పాత్ర

అల్లర్లు జరిగిన రోజు నుండే బాధితుల వెంటే ఉంటూ, ప్రతి ఒక్కరి ఆస్తి నష్టాన్ని క్షేత్రస్థాయిలో అంచనా వేయడంలో సయీద్ ఖాన్, అబ్దుల్ లయాక్ కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా 17వ వార్డు కౌన్సిలర్ ఫరానాజ్ అబ్దుల్ లయాక్ స్వయంగా బాధితుల ఇళ్లను, వ్యాపార సంస్థలను సందర్శించి వారికి ధైర్యం చెప్పడమే కాకుండా, బాధితుల జాబితా రూపకల్పనలో కీలక పాత్ర పోషించారు. వీరి నిరంతర కృషితోనే ఎంఐఎం అధినేతలు బారిస్టర్ అసదుద్దీన్ ఒవైసీ అక్బరుద్దీన్ ఒవైసీ మజ్లిస్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అతి తక్కువ కాలంలోనే ఆర్థిక సాయం అందించారు.

ఘనంగా సన్మానించిన బాధితులు తమ జీవితాల్లో వెలుగు నింపిన సయీద్ ఖాన్, అబ్దుల్ లయాక్ మరియు కౌన్సిలర్ ఫరానాజ్ అబ్దుల్ లయాక్ బాధితులు శాలువాలు కప్పి, పూలమాలలతో ఘనంగా సత్కరించారు.

ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ, "మేము దిక్కుతోచని స్థితిలో ఉన్నప్పుడు ఈ నేతలే మాకు భరోసా ఇచ్చారు. ఒవైసీ సోదరుల సహకారంతో మాకు సాయం అందేలా చేసిన వీరిని మేము ఎప్పటికీ గుర్తుంచుకుంటాం" అని భావోద్వేగానికి లోనయ్యారు. పాల్గొన్న నేతలు జిల్లా ఇన్-చార్జ్ షకీల్ అహ్మద్, చార్మినార్ కార్పొరేటర్ సాహిల్ అక్బర్ ల మార్గనిర్దేశనంలో జరిగిన ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు రసూల్, అమ్జద్ ఖాన్, హషమ్ రోషన్ పాల్గొన్నారు. నాయకులు అస్లాం ఖాన్, ఐజాజ్, షేరు, ఎహ్తేషామ్, ఆసిఫ్, ఆకిఫ్ హుస్సేన్ లు ఈ కార్యక్రమంలో పాల్గొని బాధితులకు మరియు నాయకులకు తమ సంఘీభావం తెలిపారు.

Click to join Whatsapp channel
Janahitham News
బాన్సువాడ అల్లర్ల బాధితులకు ఎంఐఎం అండ.. కన్నీళ్ల మధ్య ఆశ నింపిన నేతలు
బాన్సువాడ అల్లర్ల బాధితులకు ఎంఐఎం అండ.. కన్నీళ్ల మధ్య ఆశ నింపిన నేతలు

→ ఎడ్ల మహేష్ కుమార్ - రిపోర్టర్