హోమ్ హైదరాబాద్‌ జాతీయం అంతర్జాతీయం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ క్రీడలు ఎడ్యుకేషన్ & కెరీర్‌ బిజినెస్ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ క్రైమ్‌ సంపద వ్యవసాయం సినిమా ఈ-పేపర్
“కేసులు పెట్టను” అంటూ లంచం… బిచ్కుంద ఎక్సైజ్ సీఐ అరెస్ట్ JH-69829

జనహితం న్యూస్, బిచ్కుంద: కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద గ్రామంలో ఎక్సైజ్ సీఐ బిచ్కుందలోని తన అద్దె ఇంట్లో రూ. 2,00,000 లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ఫిర్యాదుదారునికి అధికారిక సహాయం చేస్తానని, గ్రామాల్లోని కల్లు దుకాణాలను షిఫ్ట్ చేయమని ఒత్తిడి చేయను అని, "ఇంకా కేసులు పెట్టను, కల్లు దుకాణాలు ఎలాంటి ఇబ్బంది లేకుండా నడుపుకోనిస్తాను" అని చెప్పి డబ్బు డిమాండ్ చేశాడు.

ఆయన బ్యాగ్లో లెక్కల్లో చూపని రూ.45,760 నగదు కూడా దొరికింది. ACB చర్యలు అధికారిని అరెస్ట్ చేశారు. హైదరాబాద్ నాంపల్లిలోని అడిషనల్ స్పెషల్ Judge for SPE & ACB Cases కోర్టులో హాజరుపరుస్తున్నారు కేసు దర్యాప్తులో చేస్తున్నారు. ఫిర్యాదుదారుని పేరు భద్రతా కారణాల వల్ల గోప్యంగా ఉంచారు. కాగా బిచ్కుంద మున్సిపల్ పట్టణ కేంద్రం లో ఎక్స్ సైజ్ సి ఐ సత్యనారాయణ ఇంటి పై శుక్రవారం అవినీతి అధికారులు ఆకస్మిక దాడులు కలకలం రేపింది.

బస్ స్టాండ్ కు కుత వేటు దూరంలో సి ఐ ఉంటున్న అద్దె ఇంట్లో ఎ సి బి అధికారులు దాడి నిర్వహించడంతో సి ఐ అస్వస్థత కు గురయ్యాడు. వెంటనే ఎ సి బి అధికారులు వైద్యులను పిలిపించి సోదాలు నిర్వహిస్తున్నారు. అద్దె ఇంట్లో ఉంటున్న సి ఐ ఇంటి పరిసర ప్రాంతాల్లో ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసుల బందోబస్తు మధ్య ఎ సి బి డి ఎస్ పి శేఖర్ గౌడ్ బృందం ఆధ్వర్యంలో సోదాలు నిర్వహిస్తున్నారు. దాడుల సందర్భంగా రూ.2 లక్షలతో పాటు అద్దె ఇంట్లో కొన్ని కీలక పత్రాలు, ఇతర ఆధారాలు, రికార్డులు, కొంత నగదును స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల కొందరు వ్యాపారులు, గౌడ్స్ నుండి లంచాలు డిమాండ్ చేస్తున్నట్లు వాటిని భరించాని వ్యాపారస్థులు ఎ సి బి అధికారులను సంప్రదించడం తో పిర్యాదు ల మేరకు ఈ దాడులు జరిగాయి.


Click to join Whatsapp channel
Janahitham News
“కేసులు పెట్టను” అంటూ లంచం… బిచ్కుంద ఎక్సైజ్ సీఐ అరెస్ట్
“కేసులు పెట్టను” అంటూ లంచం… బిచ్కుంద ఎక్సైజ్ సీఐ అరెస్ట్

→ ఎడ్ల మహేష్ కుమార్ - రిపోర్టర్