ఉద్యోగుల సమస్యలపై టీజీఈ జేఏసీ ఆందోళన – రాష్ట్రవ్యాప్తంగా వినతిపత్రాలు
Published on 17 Apr 2026, 04:36 PM 72
JH-50924
జనహితం న్యూస్, కామారెడ్డి: ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఈ రోజు తెలంగాణ ఎంప్లాయిస్ టీచర్స్ & పెన్షనర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ (టీజీఈ జేఏసీ)' పిలుపులో భాగంగా DAD అరతి వంత తహసీల్దార్ /ఆర్డీవో ఈ వినతిపత్రం అందించడం జరిగిందని జేఏసీ ప్రతినిధులు తెలిపారు. ఉద్యోగుల డిమాండ్ల పరిష్కారమే లక్ష్యంగా 3600NDO, ASSOS POS టీజీఈజేఏసీ ప్రకటించిన కార్యచరణలో భాగంగా శుక్రవారం మధ్యాహ్నం భోజన విరామ సమయంలో స్థానిక తహసీల్దార్ కు వినతిపత్రం సమర్పించిన అనంతరం వారు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ రాష్ట్రంలో దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న ఉద్యోగుల సమస్యలను సత్వరం పరిష్కరించాలని కోరారు.
టీజీఈ జేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డి, సెక్రటరీ జనరల్ వొడ్నాల రాజశేఖర్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్ళిన అనేక సమస్యలలో కొన్ని సమస్యలు పరిష్కారమైనప్పటికీ ఇంకా అనేక సమస్యలు, నేటికి పెండింగ్లోనే ఉన్నాయని అవేదన వ్యక్తం చేశారు. ఇదే విషయాన్ని వివిధ రూపాలలో సీఎస్, ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుందని, పెండింగ్లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని, న్యాయబద్ధమైన డిమాండ్లను వెంటనే అమలు చేయాలని వారు కోరారు.
జూన్ 2వ తేదీ నాటికి ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ ప్రకటించాలని తెలంగాణ ఎంప్లాయిస్ జాయింట్ యాక్షన్ కమిటీ మండల ప్రతినిధులు అన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా తమ కార్యాచరణ ఉంటుందన్నారు. 2026 జూన్ 2వ తేదీ నాటికి పీఆర్పీ అమలుతో పాటు పెండింగులో ఉన్న ఐదు డీఏలను విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. రిటైర్డ్ ఉద్యోగులకు సంబంధించిన పెండింగ్ బిల్స్ అన్నీ క్లియర్ చేయాలని, అలాగే రిటైర్డ్ ఉద్యోగులతో పాటు ప్రభుత్వ ఉద్యోగులకు హెల్త్ కార్డ్స్ జారీ చేసి తక్షణమే అమలు చేయాలని ప్రభుత్వాన్ని అభ్యర్థించారు.
సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ విధానంను పునరుద్ధరించాలని, కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు 2004 సెప్టెంబర్ 1వ తేదీకి ముందు నోటిఫికేషన్ వేసి తర్వాత నియామకమైన ఉద్యోగులకు వెంటనే ఓపీఎస్ విధానమును అమలు చేయాలని కోరారు. గతంలో ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం 61 సంవత్సరాలు నిండిన వీఆర్ఎల వారసుల ఉద్యోగ నియామక సమస్యను సత్వరం పరిష్కరించాలని కోరారు. అలాగే ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. త్వరలో జనాభా లెక్కల కార్యక్రమం ఉన్నందున ఉద్యోగ, ఉపాధ్యాయులకు సంబంధించిన సాధారణ బదిలీలు చేపట్టాలన్నారు.
ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో TGEJAC జిల్లా కన్వీనర్ రాజనరేంధర్, గంతంకుండు కె సన్వీనర్ పాల్గొన్నారు. భూసేకర్ సంతోష్, అయ్యల సంతోష్, సంగమేశ్వర్, శ్రీహర్ష ఆనంద్, గ్రామ పాలన అధికారులు, శ్రీకాంత్ రెడ్డి, వేద్ ప్రకాష్, కృష్ణ, కిష్టయ్య రవీంద్రనాధ్ ఆర్ఘ్య, శ్రీనివాస్ రావు, అనదికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
