హోమ్ హైదరాబాద్‌ జాతీయం అంతర్జాతీయం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ క్రీడలు ఎడ్యుకేషన్ & కెరీర్‌ బిజినెస్ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ క్రైమ్‌ సంపద వ్యవసాయం సినిమా ఈ-పేపర్
హనుమాన్ ఆలయాల్లో భక్తి సందడి.. పూజల్లో పాల్గొన్న మల్లికార్జున్ JH-17663

జనహితం న్యూస్, కామారెడ్డి: కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలో నిజాంసాగర్ మండలంలోని బంజపల్లి మరియు సుల్తాన్ నగర్ గ్రామాల్లోని హనుమాన్ ఆలయాల్లో ఈరోజు భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమాల్లో కామారెడ్డి జిల్లా డిసిసి అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్థులు మల్లికార్జున్ సన్మానించారు. భక్తులతో కలిసి పూజ కార్యక్రమాలు నిర్వహించిన ఆయన, ప్రజలందరికీ శాంతి, సుఖసంతోషాలు కలగాలని ఆకాంక్షించారు. అనంతరం జరిగిన అన్నప్రసాదం కార్యక్రమంలో స్వయంగా భక్తులకు వడ్డించిన కామారెడ్డి జిల్లా డిసిసి అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు మరియు గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Click to join Whatsapp channel
Janahitham News
హనుమాన్ ఆలయాల్లో భక్తి సందడి.. పూజల్లో పాల్గొన్న మల్లికార్జున్
హనుమాన్ ఆలయాల్లో భక్తి సందడి.. పూజల్లో పాల్గొన్న మల్లికార్జున్

→ ఎడ్ల మహేష్ కుమార్ - రిపోర్టర్