ఎండలో చల్లదనం కోసం అంబలి - బాన్సువాడలో పోచారం ప్రారంభం
Published on 08 Apr 2026, 10:57 PM 72
JH-94150
జనహితం న్యూస్, కామారెడ్డి: కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని తాడ్కోల్ చౌరస్తాలో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజులు అంబలి ప్రారంభించారు. ఎన్నో ఏళ్లుగా కీర్తిశేషులు నాగులగామ గిర్మయ్య జ్ఞాపకార్థం కొరకు తన కుమారుడు నాగులగామా వెంకన్న గుప్తా ఏర్పాటు చేశారని ఎమ్మెల్యే తెలిపారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే పోచారం మాట్లాడుతూ.., ఎండాకాలంలో జొన్న అంబలి తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఇవి మన సాంప్రదాయ పానీయమని శరీరాన్ని చల్లగా ఉంచేందుకు పనిచేస్తుందని అన్నారు.జొన్న అంబలి తాగడం వల్ల శిరీరంలోని వేడి తగ్గుతుందని ఎండ వల్ల వచ్చే అలసట తగ్గుతుందని అన్నారు. అంబలి తాగడం వల్ల వేసవిలో ఎంతో ఉపశమనం లభిస్తుందని గ్యాస్ అజీర్ణం వంటి సమస్యను తగ్గిస్తుందని రోజంతా పనిచేసే కూలీలు, వృద్ధులు ఈ అంబలిని తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.
