కేరళ అసెంబ్లీ ఎన్నికలకు ఇంచార్జుల నియామకం.. తెలంగాణ నేతలకు కీలక బాధ్యతలు
Published on 22 Mar 2026, 06:30 PM 41
JH-34875
జనహితం న్యూస్: కేరళ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో All India Congress Committee (ఏఐసీసీ) కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల నిర్వహణను పటిష్టంగా చేయడానికి వివిధ అసెంబ్లీ నియోజకవర్గాలు, జిల్లాలకు ఇంచార్జులను నియమించింది.
ఈ క్రమంలో తెలంగాణకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ముఖ్యమైన బాధ్యతలను అప్పగించడం ప్రాధాన్యత సంతరించుకుంది. రాష్ట్రాల మధ్య సమన్వయం పెంచి పార్టీ బలోపేతానికి ఈ నిర్ణయం దోహదపడనుంది.
ఎర్నాకులం, త్రిశూల్ జిల్లాలకు ఇంచార్జీగా శ్రీధర్ బాబును నియమించారు. అలాగే గిడుగు రుద్రరాజుకు కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాల బాధ్యతలు అప్పగించారు.
ఇక ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్ రావును కల్లియస్సేరి అసెంబ్లీ నియోజకవర్గానికి ఇంచార్జీగా నియమించారు. ఉత్తమ్ పద్మావతిను కొల్లాం నియోజకవర్గానికి బాధ్యతలు అప్పగించగా, డాక్టర్ బల్మూర్ వెంకట్ను దేవికులం అసెంబ్లీ నియోజకవర్గానికి ఇంచార్జీగా నియమించారు.
ఈ నియామకాలతో కేరళ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలంగా పోటీ చేసేందుకు సన్నద్ధమవుతోంది. పార్టీ వ్యూహాలను సమర్థవంతంగా అమలు చేయడంలో ఈ ఇంచార్జులు కీలక పాత్ర పోషించనున్నట్లు భావిస్తున్నారు.
