హోమ్ హైదరాబాద్‌ జాతీయం అంతర్జాతీయం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ క్రీడలు ఎడ్యుకేషన్ & కెరీర్‌ బిజినెస్ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ క్రైమ్‌ సంపద వ్యవసాయం సినిమా ఈ-పేపర్
మూడు రాష్ట్రాల్లో పోలింగ్ ప్రారంభం.. ఎక్కడ ఎంత పోటీ? JH-25732

జనహితం న్యూస్, నేషనల్ డెస్క్ : దేశంలో ఎన్నికల సందడి మొదలైంది. అసోం, కేరళ, పుదుచ్చేరిలో ఇవాళ ఉదయం పోలింగ్ ప్రశాంతంగా ప్రారంభమైంది. ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు క్యూల్లో నిలబడి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.

ఎన్నికల సంఘం ఏర్పాట్లు పక్కాగా చేయడంతో చాలా చోట్ల ఎలాంటి అంతరాయాలు లేకుండా ఓటింగ్ కొనసాగుతోంది. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది.

అసోంలో మొత్తం 126 అసెంబ్లీ స్థానాలకు గాను 722 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. కేరళలో 140 స్థానాలకు 883 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఇక పుదుచ్చేరిలో 30 స్థానాలకు 294 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.

పోలింగ్ కేంద్రాల వద్ద భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టంగా నిర్వహించారు. ఓటర్లు ఎలాంటి భయాందోళనలకు గురి కాకుండా ప్రశాంత వాతావరణంలో ఓటు వేయడానికి అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు.

మొత్తంగా మూడు రాష్ట్రాల్లోనూ ఓటింగ్ శాంతియుతంగా కొనసాగుతుండగా, సాయంత్రానికి పోలింగ్ శాతం ఎలా ఉంటుందన్నదానిపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

Click to join Whatsapp channel
Janahitham News
మూడు రాష్ట్రాల్లో పోలింగ్ ప్రారంభం.. ఎక్కడ ఎంత పోటీ?
మూడు రాష్ట్రాల్లో పోలింగ్ ప్రారంభం.. ఎక్కడ ఎంత పోటీ?

→ గోనె సాయిలు - ఎడిటర్‌ / సీనియర్ రిపోర్టర్