హోమ్ హైదరాబాద్‌ జాతీయం అంతర్జాతీయం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ క్రీడలు ఎడ్యుకేషన్ & కెరీర్‌ బిజినెస్ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ క్రైమ్‌ సంపద వ్యవసాయం సినిమా ఈ-పేపర్
రైతులకు శుభవార్త… ఖాతాల్లో నేరుగా డబ్బులు జమ! JH-11358

జనహితం న్యూస్, కొత్తపల్లి: కోటగిరి మండలం కొత్తపల్లి గ్రామంలోని రైతు వేదికలో రైతులకు ముఖ్యమైన అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రెండవ విడత రైతు భరోసా కార్యక్రమాన్ని రైతులు రైతు వేదికలో ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించారు.

ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ రైతుల ఖాతాల్లో నేరుగా డబ్బులు జమ చేయబడుతున్నాయని, ప్రభుత్వ పథకాలను పూర్తిగా వినియోగించుకోవాలని రైతులకు సూచించారు. ఈ కార్యక్రమం ద్వారా రైతులకు పథకాలపై స్పష్టమైన అవగాహన కలిగించడమే లక్ష్యమని తెలిపారు.

ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తీర్ణ అధికారి సతీష్, గ్రామ సర్పంచ్ పుప్పల గంగారం, పి సాయిలు, లాల్ సింగ్, పి గణేష్, పి సుధీర్, నిరడి హరి, కోటగిరి గణేష్, కోటగిరి సుదర్శన్, విష్ణు తదితరులు పాల్గొన్నారు. వివిధ గ్రామాల నుంచి రైతులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

Click to join Whatsapp channel
Janahitham News
రైతులకు శుభవార్త… ఖాతాల్లో నేరుగా డబ్బులు జమ!
రైతులకు శుభవార్త… ఖాతాల్లో నేరుగా డబ్బులు జమ!

→ పుప్పల వినోద్ కుమార్ - రిపోర్టర్