బసవేశ్వర మహారాజ్ జయంతి ఘనంగా నిర్వహణ
Published on 19 Apr 2026, 10:53 PM 4
JH-90133
జనహితం న్యూస్, పోతంగల్: నిజామాబాద్ జిల్లా బాన్సువాడ నియోజకవర్గం పోతంగల్ మండల కేంద్రంలో బసవేశ్వర మహారాజ్ జయంతి వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమంలో బీజేపీ కామారెడ్డి జిల్లా కౌన్సిల్ సభ్యుడు సున్నం సాయిలు పాల్గొని బసవేశ్వర మహారాజ్ చిత్రపటానికి పూలమాల వేసి, కొబ్బరికాయ కొట్టి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా సున్నం సాయిలు మాట్లాడుతూ, బసవేశ్వర మహారాజ్ సమాజంలో సమానత్వం, న్యాయం, ధర్మం కోసం పోరాడిన మహనీయుడు. ఆయన బోధనలు నేటికీ సమాజానికి మార్గదర్శకంగా నిలుస్తున్నాయి. కులమత భేదాలు లేకుండా అందరూ ఐక్యంగా ఉండాలని ఆయన ఇచ్చిన సందేశం ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టాలి అని పేర్కొన్నారు.
అనంతరం పోతంగల్ మండల బీజేపీ నాయకులు, కార్యకర్తలు సున్నం సాయిలును ఘనంగా సన్మానించారు. ఈ సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న ఎన్నారై కోనేరు శశాంక్ మాట్లాడుతూ, బసవేశ్వరుని ఆశయాలు యువతకు స్ఫూర్తి ప్రదాయకం. సమాజ అభివృద్ధికి ఆయన చూపిన మార్గంలో నడవడం ద్వారా సమగ్ర అభ్యున్నతి సాధ్యమవుతుంది. ఇలాంటి మహనీయుల జయంతులను నిర్వహించడం ద్వారా వారి సిద్ధాంతాలను తరతరాలకు చేరవేయాలి అని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక బీజేపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు, పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
