రామకృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో చలివేంద్రం ప్రారంభోత్సవం
Published on 20 Apr 2026, 08:53 PM 48
JH-68700
జనహితం న్యూస్, కోటగిరి: రామకృష్ణ సేవా సమితి కోటగిరి వారి ఆధ్వర్యంలో (దాతల సహాయంతో) చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కోనేరు చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ శశాంక్ ఎన్నారై గారు మరియు కోటగిరి గ్రామ సర్పంచ్ బర్ల మధుకర్ మరియు రామకృష్ణ సేవాసమితి సభ్యులు పాల్గొన్నారు.
హైదరాబాద్ వాస్తవ్యులు శ్రీమతి& శ్రీ మల్లారెడ్డి శ్వేత శ్రీనివాస్ రెడ్డి గార్ల కుమార్తె చిరంజీవి మల్లారెడ్డి చంద్రవదన గారు కూల్ వాటర్ బాటిల్స్ ని డొనేట్ చేయడం జరిగింది. అదేవిధంగా హైదరాబాద్ వాస్తవ్యులు కీర్తిశేషులు శ్రీమతి శ్రీ పోలా సోమశంకర్ గుప్తా, లక్ష్మీబాయి గార్ల జ్ఞాపకార్ధం వారి కుమారుడు మరియు కోడలు పోల వెంకటేశ్వరరావు మరియు శోభారాణి వారు రెండు వారాలపాటు మజ్జిగను ఇవ్వటం జరిగింది.
వీరి పవిత్ర హృదయానికి శ్రీరామకృష్ణ సేవా సమితి కోటగిరి తరఫున కృతజ్ఞతలు తెలిపారు.
