హోమ్ హైదరాబాద్‌ జాతీయం అంతర్జాతీయం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ క్రీడలు ఎడ్యుకేషన్ & కెరీర్‌ బిజినెస్ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ క్రైమ్‌ సంపద వ్యవసాయం సినిమా ఈ-పేపర్
మహిళల ఆర్థిక స్వావలంబనకు మరో ముందడుగు JH-56045

జనహితం న్యూస్, పోలవరం: డ్వాక్రా వివోఏలకు 5జీ స్మార్ట్‌ఫోన్లు – PMAJAY కింద లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ 

“టెక్నాలజీతో మహిళల శక్తివంతం – సంక్షేమంతో జీవితాల్లో వెలుగు” : ఎమ్మెల్యే చిర్రి బాలరాజు. 

పోలవరం నియోజకవర్గంలో మహిళల ఆర్థిక స్వావలంబన, గ్రామీణాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు స్పష్టం చేశారు. మంగళవారం బర్రింకలపాడు లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో డ్వాక్రా సంఘాల సహాయకులు (VOA)లకు 374 ఆధునిక 5జీ స్మార్ట్ ఫోన్లను పంపిణీ చేయడంతో పాటు, ప్రధానమంత్రి అనుసూచిత జాతి అభ్యుదయ యోజన (PMAJAY)లో భాగంగా అర్హులైన లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు.

కార్యక్రమం ప్రారంభానికి ముందు ఎమ్మెల్యేకు మహిళలు సంప్రదాయబద్ధంగా ఘన స్వాగతం పలికారు. వెలుగు శాఖ గీతంతో కార్యక్రమం ప్రారంభమై, ఉత్సాహభరిత వాతావరణంలో సాగింది. వివోఏలతో పాటు మహిళా సంఘాల ప్రతినిధులు తమ సమస్యలు, సేవల నిర్వహణలో ఎదురవుతున్న ఇబ్బందులను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే చిర్రి బాలరాజు మాట్లాడుతూ, గ్రామీణ మహిళల సాధికారతకు డ్వాక్రా సంఘాలు పునాది వంటివని, వాటి బలోపేతం ద్వారానే కుటుంబాల ఆర్థిక స్థితి మెరుగుపడుతుందని అన్నారు. వివోఏలు గ్రామస్థాయిలో ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేసే కీలక భూమిక పోషిస్తున్నారని, వారి పనితీరును మరింత సమర్థవంతం చేయడానికి టెక్నాలజీ వినియోగం అవసరమని పేర్కొన్నారు.

5జీ స్మార్ట్‌ఫోన్ల ద్వారా వివోఏలు త్వరితగతిన సమాచారం పంచుకోవడంతో పాటు, పథకాల అమలు, లబ్ధిదారుల ఎంపికలో పారదర్శకత పెరుగుతుందని తెలిపారు. మహిళల అభివృద్ధి, వారి ఆర్థిక స్థిరత్వమే రాష్ట్ర అభివృద్ధికి బలమైన పునాది అని అన్నారు.

అదేవిధంగా, వివోఏల సంక్షేమం దృష్ట్యా కేవలం రూ.400 ప్రీమియంతో రూ.5 లక్షల ఆరోగ్య బీమా సదుపాయం కల్పించేలా వ్యక్తిగతంగా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ నిర్ణయం వల్ల వివోఏలు భవిష్యత్తులో ఆర్థిక భద్రతను పొందగలరని పేర్కొన్నారు.

ఇక PMAJAY పథకం కింద చెక్కుల పంపిణీ సందర్భంగా, అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సహాయం వారి జీవితాల్లో మార్పు తీసుకువస్తుందని, స్వయం ఉపాధి అవకాశాలు పెంచుతుందని ఎమ్మెల్యే తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు నిజమైన అర్హులకు చేరేలా నిరంతరం కృషి చేస్తున్నామని చెప్పారు.

కార్యక్రమం చివరలో ఎమ్మెల్యే స్వయంగా స్మార్ట్ ఫోన్లు మరియు చెక్కులను లబ్ధిదారులకు అందజేసి, వారితో మమేకమయ్యారు. ఈ సందర్భంగా మహిళలు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలుపుతూ, ప్రభుత్వం అందిస్తున్న సహాయం తమ కుటుంబాలకు ఎంతో ఉపయుక్తంగా ఉందని అభిప్రాయపడ్డారు.

ఈ కార్యక్రమంలో జనసేన మండల అధ్యక్షులు పసుపులేటి రాము, అడపా నాగరాజు, మెట్ట బుచ్చిరాజు, ములిసేట్టి యుగంధర్, తోట రవి, గుణపర్తి చిన్ని, టిడిపి మండల అధ్యక్షులు సుంకపల్లి సాయి, గ్రీనరీ & బ్యూటిఫికేషన్ డైరెక్టర్ పాదం కృష్ణ, కూటమి నాయకులు కొనతాల ప్రసాద్, దుగ్గిన శ్రీనివాస్, మాదేపల్లి శ్రీనివాస్, తమ్మన సాంబ, ఉండవల్లి కిరణ్, ఏపీ డి రాజబాబు, వెలుగు ఏపీఎంలు పద్మావతి, శ్రీనివాస్, ఝాన్సీ, జేమ్స్, నరసింహారావు, భానుమతి తదితరులు, కార్యకర్తలు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Click to join Whatsapp channel
Janahitham News
మహిళల ఆర్థిక స్వావలంబనకు మరో ముందడుగు
మహిళల ఆర్థిక స్వావలంబనకు మరో ముందడుగు

→ కొవ్వలి రవితేజ - రిపోర్టర్