శిధిలమైన రామ మందిరం నూతన నిర్మాణానికి చర్యలు
Published on 19 Apr 2026, 07:28 PM 73
JH-51038
జనహితం న్యూస్, టీ నర్సాపురం: ఏలూరు జిల్లా టీ నర్సాపురం మండలంలోని చిన్న గురవాయిగూడెం మాలపల్లిలో సంవత్సరాల తరబడి వుంటున్న రామాలయం గత కొన్ని సంవత్సరాలుగా శిధిలమై వుండటంతో 2024 ఎలక్షన్ ప్రచారానికి వెళ్ళగా గ్రామస్తులు ఈ సమస్యను దృష్టికి తీసుకుని వచ్చారు.
ఈరోజు గ్రామ పెద్దలతో సమావేశమై ఖచ్చితంగా నూతన రామ మందిరం నిర్మాణం జరుగుతుందని దానికి ప్రభుత్వం మరియు టిటిడి తరుపున నిధులు మంజూరు చేయిస్తామని ఇలాంటి దళిత వాడలలో మందిరాల నిర్మాణం వలన భక్తిబావం కలిగి యువత అంతా చెడు మార్గాలను వదిలి భక్తిభావంతో సన్మార్గంలో నడుస్తారని దానికి నా వంతుగా అన్ని ప్రయత్నాలు చేస్తానని రాముని ఆశీస్సులతో ప్రభుత్వం మరియు టిటిడి సహకారంతో త్వరలోనే మందిరం నిర్మాణం జరుగుతుందని గ్రామస్తులకు మరియు పెద్దలకు తెలియజేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో సంఘ పెద్దలు మరియు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శి కొండపల్లి రవి పాల్గొన్నారు.
