హోమ్ హైదరాబాద్‌ జాతీయం అంతర్జాతీయం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ క్రీడలు ఎడ్యుకేషన్ & కెరీర్‌ బిజినెస్ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ క్రైమ్‌ సంపద వ్యవసాయం సినిమా ఈ-పేపర్
రైతులకు కీలక సూచనలు.. యూరియా వాడకంపై మంత్రి హెచ్చరిక JH-96556

జనహితం న్యూస్, హైదరాబాద్: ప్రతి మంగళవారం నిర్వహించే 'రైతునేస్తం' కార్యక్రమంలో భాగంగా... ఈ రోజు నిర్వహించిన 'రైతునేస్తం' కార్యక్రమంలో వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సచివాలయం నుండి హాజరయ్యారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతులతో ముఖాముఖి మాట్లాడిన మంత్రి యూరియా యాప్ మరియు యూరియా వినియోగం వంటి అంశాలపై రైతుల అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... 'రైతునేస్తం' కార్యక్రమంలో రైతులు అధికంగా పాల్గొనేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.  

రైతుల సందేహాలను నివృత్తి చేయడంతో పాటు, రైతులకు ఆధునిక వ్యవసాయ పద్ధతులపై అవగాహన కల్పించడమే 'రైతునేస్తం' కార్యక్రమ లక్ష్యమని మంత్రి ఈ సందర్భంగా తెలిపారు. యూరియా యాప్ పై రైతుల అభిప్రాయాలను మంత్రి అడిగి తెలుసుకున్నారు. యూరియా యాప్ తో లైన్లలో నిలబడే బాధ తప్పిందని, ఇంట్లో నుంచే యూరియాను బుక్ చేసుకోని, ఉచిత సమయంలో తెచ్చుకునేందుకు వీలు కలిగిందని, దీంతో సమయం వృథా కాకుండా ఉందని రైతులు యూరియా యాప్ ని కొనియాడారు. 

అధిక యూరియా వాడకం ద్వారా వచ్చే అనర్థాలను రైతులకు ఈ సందర్భంగా మంత్రి వివరించారు. దేశంలోనే అధికంగా యూరియా వాడుతున్న రాష్ట్రాలలో తెలంగాణ కూడా ఉందని, ఇది ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదని ఆయన అన్నారు. రైతులు యూరియాను అధికంగా వినియోగించవద్దని కోరారు. యూరియాను అధికంగా వాడటం వల్ల, నేల ఆరోగ్యం దెబ్బతినడంతో పాటు, రానురాను దిగుబడులు కూడా తగ్గుతాయని, చీడ పీడల సమస్యలు పెరుగుతాయని తెలిపారు. 

ఇప్పుడు పంటల కోతల సమయం వచ్చిందని, రైతులు కోతల అనంతరం వచ్చే పంట వ్యర్థాలను కాల్చవద్దని మంత్రి ఈ సందర్భంగా అన్నారు. పంట వ్యర్థాలను కాల్చడం ద్వారా పర్యావరణం దెబ్బతింటుందని తెలిపారు. రైతులు తాము పండించే అన్ని పంటలలో పామాయిల్ పంటను కూడా వేయవచ్చని, పామాయిల్ పంటను వేసి కూడా వరి, పత్తి, మొక్కజొన్న లాంటి పంటలు పండించుకోవచ్చని రైతులకు వివరించారు. రైతులందరు పామాయిల్ పంటను వేసినట్లయితే స్థిరమైన అధిక ఆదాయం పొందే వీలుంటుందని మంత్రి అన్నారు.

Click to join Whatsapp channel
Janahitham News
రైతులకు కీలక సూచనలు.. యూరియా వాడకంపై మంత్రి హెచ్చరిక
రైతులకు కీలక సూచనలు.. యూరియా వాడకంపై మంత్రి హెచ్చరిక

→ గోనె సాయిలు - ఎడిటర్‌ / సీనియర్ రిపోర్టర్