"అల్ఫోర్స్" నరేందర్ రెడ్డి గారి స్వగృహంలో ఘనంగా శ్రీరాముని ఎదుర్కోలు మహోత్సవం
Published on 25 Mar 2026, 09:04 PM 34
JH-91312
జనహితం న్యూస్: శ్రీ సీతరాముని కళ్యాణ మహోత్సవం జగత్తుకు గొప్ప వేడుక అని మరియు భక్తి పారవశ్యానికి వేదికని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు & విఎన్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు "అల్ఫోర్స్" డాక్టర్ వి. నరేందర్ రెడ్డి గారు సప్తగిరి కాలనీలోని గల శ్రీ కోదండ రామాలయంలో నిర్వహించబోయే శ్రీరాముని కళ్యాణ మహోత్సవాన్ని పురస్కరించుకొని వారి స్వగృహంలో నిర్వహించినటువంటి ఎదుర్కోలు మహోత్సవానికి ప్రధాన కర్తగా హాజరై వారు మాట్లాడారు.
ఈ సందర్భంగా వారు ప్రజలందరికీ ముందస్తుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేసి ప్రతి ఒక్కరూ రామ నామాన్ని జపించాలని మరియు శుభ ఫలాలు పొందాలని కోరారు.
ఈ కార్యక్రమంలో వికాస తరంగిణి అధ్యక్షులు గౌతమ్ రావు గారు, ఆలయ కమిటీ సభ్యులు తుమ్మల రమేష్ రెడ్డి గారు, పి రాజిరెడ్డి గారు, శ్రీహారిరెడ్డి గారు, జి.రాజిరెడ్డి గారు, పివి మాధవ్ రాజు గారు, ప్రధాన అర్చకులు రామాచార్యులు మరియు తదితరులు పాల్గొన్నారు
