అరైవ్ అలైవ్ 4వ రోజు గ్రాండ్ సక్సెస్.. రోడ్డు భద్రతపై భారీ అవగాహన!
Published on 16 Apr 2026, 08:09 PM 75
JH-93990
జనహితం న్యూస్, కామారెడ్డి: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక' 99 రోజుల కార్యాచరణలో భాగంగా, జిల్లా ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర ఆధ్వర్యంలో గాంధారిలో నిర్వహించి "Arrive Alive Road Safety Programme" లో TGSP బెటాలియన్ల అదనపు డీజీపీ సంజయ్ కుమార్ జైన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, ఏప్రిల్ 13 నుండి 18 వరకు జిల్లావ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నామని, ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. అతివేగం, మద్యం సేవించి వాహనాలు నడపడం, రాంగ్ రూట్ డ్రైవింగ్ మరియు సిగ్నల్ ఉల్లంఘనల వల్ల జరుగుతున్న ఘోర ప్రమాదాలను, జిల్లాలో గుర్తించిన బ్లాక్ స్పాట్ల వద్ద తీసుకుంటున్న నివారణ చర్యలను ఆయన PPT ద్వారా ప్రజలకు కళ్ళకు కట్టినట్టు వివరించారు. ఈ చర్యల ఫలితంగా 2025లో రోడ్డు ప్రమాదాలు తగ్గుముఖం పట్టాయని వెల్లడించారు.
నాలుగో రోజు కార్యక్రమంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా అధికారులు, ప్రజలు హెల్మెట్, సీటు బెల్టులు ధరించి ఇతరులను ప్రోత్సహించారని తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా TGSP Bns Addl. DGP సంజయ్ కుమార్ జైన్ మాట్లాడుతూ దేశంలో యుద్ధాల వల్ల జరుగుతున్న మరణాల కంటే రోడ్డు ప్రమాదాల కారణంగా సంభవిస్తున్న మరణాలే అత్యంత ఆందోళనకరంగా ఉన్నాయని TGSP బెటాలియన్ల అదనపు డీజీపీ సంజయ్ కుమార్ జైన్ అన్నారు.
జిల్లా ఎస్పీ యం . రాజేష్ చంద్ర ఆధ్వర్యంలో గాంధారిలో నిర్వహించిన 'అరైవ్ అలైవ్' రోడ్డు భద్రతా కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. గడిచిన కేవలం ఒకటిన్నర నెల కాలంలోనే దేశవ్యాప్తంగా సుమారు 20 వేల మంది రోడ్డు ప్రమాదాల్లో మరణించడం పట్ల ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసు శాఖ కఠినమైన ఎన్ఫోర్స్మెంట్ నిర్వహిస్తున్నప్పటికీ, ప్రతి పౌరుడు బాధ్యతగా వ్యవహరించినప్పుడే రోడ్డు ప్రమాదాలను సంపూర్ణంగా అరికట్టడం సాధ్యమవుతుందని ఆయన పిలుపునిచ్చారు.
జిల్లాలో ఎస్పీ అమలు చేస్తున్న ఆపరేషన్ కవాచ్, కిడ్స్ విత్ ఖాఖీ మరియు అరైవ్ అలైవ్ వంటి వినూత్న కార్యక్రమాలను, అలాగే ప్రజల ఆరోగ్యం కోసం ఏర్పాటు చేసిన ఐ క్యాంప్ను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిబిరాన్ని అదనపు డీజీపీ గారు ప్రారంభించారు. స్వయంగా తానే కంటి పరీక్షలు చేయించుకుని ప్రజలందరికీ ఆదర్శంగా నిలిచారు.
ఈ శిబిరంలో మొత్తం 276 మందికి నిపుణులైన వైద్యులచే కంటి పరీక్షలు నిర్వహించగా, అవసరమైన 39 మందికి ఉచితంగా కళ్లజోళ్లు మరియు మందులను పంపిణీ చేశారు. రహదారి భద్రతపై అవగాహనతో పాటు ఇటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ (అడ్మిన్) కె. నరసింహ రెడ్డి, ఎల్లారెడ్డి డీఎస్పీ ఎస్. శ్రీనివాస్ రావు, సదాశివనగర్ సిఐ సంతోష్ కుమార్, ఎల్లారెడ్డి సిఐ రాజారెడ్డి, గాంధారి ఎస్ఐలు, ఎంఆర్డి, గాంధారి సర్పంచ్ రేణుక సంజీవ్, వివిధ గ్రామాల సర్పంచ్లు, పోలీస్ సిబ్బంది, ఆటో డ్రైవర్లు మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
