బాన్సువాడలో బీజేపీ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి ఘనంగా
Published on 14 Apr 2026, 08:04 PM 58
JH-33960
జనహితం న్యూస్, కామారెడ్డి: అంబేద్కర్ జయంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ బాన్సువాడ శాఖ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి ఆ మహనీయునికి ఘన నివాళులు అర్పించడం జరిగింది.
ఈ సందర్భంగా బిజెపి పట్టణ అధ్యక్షులు కొండల గంగారెడ్డి మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని అమలు చేయడం వల్ల ఈరోజు పేద మధ్యతరగతి న్యాయం జరుగుతుందని అంబేద్కర్ ఆశయాలను ప్రతి ఒక అవలంబించాలని ఆయన అడుగుజాడలో నడవాలని యువత అంబేద్కర్ కు ఆదర్శంగా తీసుకోవాలని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు చిదుర సాయిలు, జిల్లా కార్యదర్శి శంకర్ గౌడ్, బిజెపి మున్సిపల్ కౌన్సిలర్ గజ్జల మహేష్, బిజెపి పట్టణ ప్రధాన కార్యదర్శి ఉమేష్, బిజెపి నాయకులు శ్రీనివాస్, లక్ష్మీనారాయణ, చీకట్ల రాజు, కొండని గంగారం, చంద్రశేఖర్ గౌడ్, శంకర్, లక్ష్మి, మమత, భూమేష్, సాయి రెడ్డి, వెంకట్ మరియు ప్రజలు పాల్గొన్నారు.
