ధర్మ పరిరక్షణపై ఘాటు పిలుపు, ప్రతి ఒక్కరూ హిందువుగా జీవించాలి: బాలయోగి
Published on 19 Apr 2026, 07:30 PM 81
JH-67757
జనహితం న్యూస్, జుక్కల్: కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలో ప్రస్తుత సమాజంలో ధర్మ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ హిందువుగా జీవించాల్సిన అవసరం ఉందని శ్రీ లింగేశ్వర గుట్ట ఆశ్రమం వ్యవస్థాపకులు బాలయోగి కృష్ణ మహారాజ్ పేర్కొన్నారు. మహమ్మద్నగర్ మండల కేంద్రంలోని ప్రాథమిక సహకార సంఘం ఫంక్షన్ హాల్లో ఆదివారం నిర్వహించిన జై హనుమాన్ హిందూ సమ్మేళనంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఆర్ఎస్ఎస్ స్థాపనకు వందేళ్లు పూర్తైన సందర్భంగా నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు.
ఈ సందర్భంగా బాలయోగి కృష్ణ మహారాజ్ మాట్లాడుతూ, హిందూ సమాజం జాగృతం కావాల్సిన అవసరం ఉందన్నారు. ధర్మ పరిరక్షణ కోసం ప్రతి హిందువు తన కుటుంబంలో ఆధ్యాత్మిక విలువలను పెంపొందించేందుకు కృషి చేయాలని, పిల్లలను ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొనేలా ప్రోత్సహించాలని సూచించారు. భారతదేశానికి హిందూ ధర్మం, సంస్కృతి ఆత్మ, ప్రాణమని ఆయన పేర్కొన్నారు. సమాజాన్ని చైతన్యవంతం చేసి ఐక్యపరిచి దేశాన్ని విశ్వగురువుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ఇటువంటి సమ్మేళనాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. దేశ గొప్పతనాన్ని ప్రపంచానికి తెలియజేసేలా ధార్మిక కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు.
ఈ సమ్మేళనంలో చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఇందూర్ విభాగ్ కళాశాల ప్రముఖ్ ఉల్లెంగ ముత్యం, మండల హిందూ సమాజ కమిటీ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, సభ్యులు రవి కిరణ్, భాను ప్రకాష్, రాజా గౌడ్ స్వామి, బాలరాజ్, కొండ అనిల్ సెట్, ఓంకార్, సంతు పాల్గొన్నారు.
