950 మార్కులతో సానియా టాప్ - మోడల్ స్కూల్‌కు గర్వకారణం
Published on 19 Apr 2026, 07:12 PM 78
JH-86437
జనహితం న్యూస్, జుక్కల్: కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం నిజాంసాగర్ మండల కేంద్రంలోని సుల్తాన్ నగర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎస్.కే. చాంద్ పాషా కుమార్తె సానియా, నిజాంసాగర్ మండల కేంద్రంలోని మోడల్ స్కూల్లో చదువుతూ విద్యలో విశేష ప్రతిభ కనబరిచి ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరంలో 950/1000 మార్కులతో కాలేజ్ టాపర్‌గా నిలిచింది.
గ్రామీణ ప్రాంతాల్లో నాణ్యమైన విద్యను అందిస్తున్న మోడల్ స్కూల్ నుంచి ఇంత మంచి ఫలితం రావడం ఆ పాఠశాల ప్రతిష్టను మరింత పెంచింది.ఉపాధ్యాయుల మార్గదర్శకత్వం, క్రమశిక్షణతో కూడిన విద్యా విధానం, విద్యార్థుల కృషి ఈ విజయానికి ప్రధాన కారణాలుగా నిలిచాయి.
ఈ సందర్భంగా కామారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ స్వయంగా సానియాను శాలువాతో ఘనంగా సత్కరించి అభినందించారు.ఆమె సాధించిన అద్భుత విజయాన్ని కొనియాడుతూ,భవిష్యత్తులో ఇంకా ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆశీర్వదించారు.విద్యార్థులకు ప్రోత్సాహం అందించడంలో ఆయన ఎల్లప్పుడూ ముందుంటారని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మోడల్ స్కూల్ ఉపాధ్యాయులు మరియు గ్రామస్థులు పాల్గొని సానియాకు శుభాకాంక్షలు తెలిపారు.
