హోమ్ హైదరాబాద్‌ జాతీయం అంతర్జాతీయం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ క్రీడలు ఎడ్యుకేషన్ & కెరీర్‌ బిజినెస్ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ క్రైమ్‌ సంపద వ్యవసాయం సినిమా ఈ-పేపర్
మార్చి 30న హైదరాబాద్ ఇంద్రపార్క్‌లో నిరాహార దీక్ష – ఎమ్మార్పీఎస్ నేతల పిలుపు JH-10885

జనహితం న్యూస్, కామారెడ్డి మార్చ్ 26: SC సంక్షేమ పథకాల సాధనకై మాదిగ దండోరా హైదరాబాద్ ఇంద్ర పార్క్ తరలిరావాలని. రాష్ట్ర ప్రభుత్వం దళితులకు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు త్వరగా నెరవేర్చాలని, మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి వానిని అమలు చేయాలని కోరారు.

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అభయ హస్తం కింద 12 లక్షల ఆర్థిక సాయం తక్షణమే అందించాలి. అర్హులైన ప్రతి దళిత కుటుంబానికి 3 ఎకరాల భూమి కేటాయించాలి. G.O.No.58, 59 ప్రకారం పట్టాలు ఇచ్చి అమ్ముకునే హక్కు కల్పించాలి.

విద్య రిజర్వేషన్ ప్రకారం కార్పొరేట్ విద్య సంస్థల్లో 25% ఉచిత విద్యను కచ్చితంగా అమలు చేయాలి. ఎస్సీ కార్పొరేషన్ నిధులు కార్పొరేషన్ శాఖకు 15 వేల కోట్ల రూపాయలు కేటాయించి సబ్సిడీ రుణాలు మంజూరు చేయాలి.

కార్మికులకు గుర్తింపు కార్డులు ఇవ్వడంతో పాటు, 4వ తరగతి ఉద్యోగులుగా గుర్తించి 20 వేల కనీస వేతనం ఇవ్వాలి. లీడ్ క్యాప్ పునరుద్ధానంతో తోలు పరిశ్రమకు 10,000 కోట్ల రూపాయలు కేటాయించి, చైర్మన్‌ను నియమించి పరిశ్రమను అభివృద్ధి చేసి మాదిగ యువతకు ఉపాధి కల్పించాలి.

ఇంద్రమ్మ ఇల్లు కింద ఇస్తున్న ఆర్థిక సాయం 5 లక్షలతో పాటు ఎస్సీలుగా గుర్తించి ఇసుక, స్టీల్, సిమెంట్ ఉచితంగా ఇవ్వాలి. ఈ పథకాల సాధన కోసం ఎస్సీ కులాల్లో ఉన్న దళితులందరికీ వర్తించే విధంగా ఉన్నందున ప్రతి ఒక్కరూ నిరాహార దీక్షకు తరలిరావాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా అధ్యక్షులు రూసేగం భూమయ్య మాదిగ, నియోజకవర్గ ఇన్‌చార్జి వెండి యాదవ రావు, బిచ్కుంద మండల గౌరవ అధ్యక్షులు బాలకృష్ణ, మేతిరి కిష్టయ్య పాల్గొన్నారు.

Click to join Whatsapp channel
Janahitham News
మార్చి 30న హైదరాబాద్ ఇంద్రపార్క్‌లో నిరాహార దీక్ష – ఎమ్మార్పీఎస్ నేతల పిలుపు
మార్చి 30న హైదరాబాద్ ఇంద్రపార్క్‌లో నిరాహార దీక్ష – ఎమ్మార్పీఎస్ నేతల పిలుపు

→ ఎడ్ల మహేష్ కుమార్ - రిపోర్టర్