హోమ్ హైదరాబాద్‌ జాతీయం అంతర్జాతీయం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ క్రీడలు ఎడ్యుకేషన్ & కెరీర్‌ బిజినెస్ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ క్రైమ్‌ సంపద వ్యవసాయం సినిమా ఈ-పేపర్
రమేష్ గౌడ్‌పై ఆరోపణలు తప్పుడు.. కేసులు వెనక్కి తీసుకోకపోతే ఆగ్రహం తీవ్రం JH-37356

జనహితం న్యూస్, కామారెడ్డి: కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆర్. అండ్. బి. అతిథి గృహంలో కామారెడ్డి జిల్లా పాల్వంచ మండలం పరిధి పేట గ్రామ అంబేద్కర్ బహుజన నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, బహుజన బిడ్డ అయిన పల్లె రమేష్ గౌడ్ పై కొంతమంది తమ స్వార్థం కోసం ఆరోపణలు చేస్తూ చేసిన ఫిర్యాదును వెంటనే ఉపసంహరించుకోవాలని, లేదంటే దళిత, బహుజనుల ఆగ్రహానికి గురికాక తప్పదని దళిత, బహుజన సంఘాల నాయకులు హెచ్చరించారు. పాల్వంచ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పల్లె రమేష్ గౌడ్ ప్రజా సేవకుడు అని, అతడు దళితులను అవమానించే వ్యక్తి కాదన్నారు. కులమతాలకు అతీతంగా అందరితో కలసి ఉండే వ్యక్తి అని పేర్కొన్నారు. అలాంటి వ్యక్తిపై కొంతమంది తప్పుడు ఆరోపణలు చేయడం శోచనీయమన్నారు. ఆయనపై పెట్టిన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.

గ్రామంలో ఏవైనా సమస్యలు ఉంటే వారు గ్రామంలో మాట్లాడుకోవాలి తప్ప ఇలా కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేయడం సరికాదన్నారు. తనతో రాజకీయ విభేదాలు ఉంటే గ్రామంలో చూసుకోవాలే తప్ప కొంత మందిని ఉసిగొలిపి ఇలా కేసులు పెట్టించడం తగదని ఫరీద్ పేట గ్రామ సర్పంచ్ నర్సింహ రెడ్డి కి సూచించారు. గ్రామంలో ప్రతీ యేటా జరిగే సీతారాముల కళ్యాణోత్సవంలో దళితులను ప్రత్యేకంగా పిలిచి బట్టలు పెట్టి పూజలో కూర్చుండబెట్టిన రమేష్ గౌడ్ పైన దళితులను కించపరిచేలా మాట్లాడాడని ఆరోపణలు చేయడం సిగ్గుచేటన్నారు. గ్రామంలో అభివృద్ధి ఎవరి ద్వారా చేశారో గ్రామంలో నిరూపించుకోవాలని గుర్తు చేశారు ఇప్పటికైనా రమేష్ గౌడ్ పై చేసిన ఫిర్యాదును ఉపసంహరించుకోవాలని లేనియెడల తమ ఇండ్లను ముట్టడిస్తామని డిమాండ్ చేశారు. అనంతరం ఏఎస్పి చైతన్య రెడ్డికి ఫిర్యాదు చేశారు.

ఈ సమావేశంలో దళిత, బహుజన సంఘాల నాయకులు దేవుళ్ళ రాములు, బైండ్ల రామస్వామి, విష్ణు, లక్ష్మీనర్సు, భూమవ్వ, కొంగల లక్ష్మి, రాజమణి, వరలక్ష్మి, తగిరంచ రాజిరెడ్డి, పెరుమాండ్ల నర్సింలు తదితరులు పాల్గొన్నారు.

Click to join Whatsapp channel
Janahitham News
రమేష్ గౌడ్‌పై ఆరోపణలు తప్పుడు.. కేసులు వెనక్కి తీసుకోకపోతే ఆగ్రహం తీవ్రం
రమేష్ గౌడ్‌పై ఆరోపణలు తప్పుడు.. కేసులు వెనక్కి తీసుకోకపోతే ఆగ్రహం తీవ్రం

→ ఎడ్ల మహేష్ కుమార్ - రిపోర్టర్