శ్రీ సాయి విజ్ఞాన్ హై స్కూల్ పద్మాజివాడి గ్రామం లో సమాచార హక్కు చట్టం 2005 పైన అవగాహన
Published on 02 Apr 2026, 07:05 PM 34
JH-41305
జనహితం న్యూస్, కామారెడ్డి: కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గం శ్రీ సాయి విజ్ఞాన్ హై స్కూల్ పద్మాజివాడి గ్రామం లో సమాచార హక్కు చట్టం 2005 పైన అవగాహన కార్యక్రమంలో రాష్ట్ర డైరెక్టర్ సలీం... సదాశినగర్ మండలంలోని పద్మాజివాడి గ్రామంలో గల శ్రీ సాయి విజ్ఞాన్ హై స్కూల్ లో సమాచార హక్కు చట్టం 2005 మరియు ఇతర చట్టాల పైన అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగినది.
ఇట్టి కార్యక్రమానికి పాఠశాల కరస్పాండెంట్ శ్రీ రవీందర్ రెడ్డి గారు అధ్యక్షత వహించగా ముఖ్యఅతిథిగా సమాచార హక్కు చట్ట పరిరక్షణ కమిటీ తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ మరియు ద్వితీయ శ్రేణి న్యాయమూర్తి శ్రీ ఎం ఏ సలీం పాల్గొని ఈ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులకు అవగాహన కల్పించడం జరిగినది.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ విష్ణువర్ధన్ మరియు సమాచార హక్కు చట్ట పరిరక్షణ కమిటీ కామారెడ్డి జిల్లా సలహాదారులు భాగ్యలక్ష్మి పాఠశాల అధ్యాపక బృందం మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.
