హోమ్ హైదరాబాద్‌ జాతీయం అంతర్జాతీయం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ క్రీడలు ఎడ్యుకేషన్ & కెరీర్‌ బిజినెస్ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ క్రైమ్‌ సంపద వ్యవసాయం సినిమా ఈ-పేపర్
సెక్రటేరియట్ వద్ద ఉద్రిక్తత.. ఉద్యమకారుల అరెస్టులు JH-64329

జనహితం న్యూస్, బాన్సువాడ: కామారెడ్డి జిల్లా బాన్సువాడ మలిదశ ఉద్యమకారులు సెక్రెటరీ ప్రిన్సిపాల్ కి తమ బాధలు చెప్పుకోవడానికి వస్తే ఈ యొక్క పోలీసులు ఉద్యమకారులని అక్రమంగా అరెస్టు చేసి సెక్రెటరీ నుంచి పంజాగుట్ట పోలీస్ స్టేషన్ తరలించడం జరిగింది. ఉద్యమకారులు ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హామీలు ఇచ్చారు ఆ హామీలను 28 నెలలైనా ఇప్పటి వరకు అమలు చేయకపోవడంతో మలిదశ ఉద్యమకారులు పోటెత్తి వాళ్ల మనోభాదులను వివరించడానికి వెళ్లడం జరిగింది.

దీనిని ఆసరాగా చేసుకున్న పోలీసులు మలిదశ ఉద్యమకారుల్ని కుక్కల లాగా ఈడ్చుకుంటూ పోలీసు వాహనాల్లో సెక్రెటరీ ఆఫీసు నుంచి పంజాగుట్ట పోలీస్ స్టేషన్కు తరలించడం జరిగింది. ఇక్కడ పోలీస్ స్టేషన్లో ఎంతమంది పోలీసులను ఒక గ్లాసు నీళ్లు ఇవ్వమన్నా దొరకాని పరిస్థితి దాపురించింది. ఇదేనా మనం సాధించుకున్న బంగారు తెలంగాణ ఇదేనా ఉద్యమకారులకు ఇచ్చే ఇందిరమ్మ ప్రజా పాలన అంటూ ఉద్యమకారులు పోలీస్ స్టేషన్ పోలీసులను గెరవ్ చేయడం జరిగింది. ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు ఉద్యమకారులకు ఇచ్చిన మా హామీలను గుర్తించి జూన్ రెండవ తారీఖు వరకు ప్రకటన చేయకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పారు.

ఇట్టి కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా ఉద్యమకారుల అధ్యక్షులు ఉడుత గంగాధర్ గుప్తా మండల అధ్యక్షులు గంజి చందు, కామారెడ్డి జిల్లా మీడియా కన్వీనర్ దండు విజయ్ కుమార్, ఎద్దుబల్లి కృష్ణ, కాల్వ శ్యామ్, భాస్కర్ గౌడ్, గంగారం, బిచ్కుంద గంగారం, తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Click to join Whatsapp channel
Janahitham News
సెక్రటేరియట్ వద్ద ఉద్రిక్తత.. ఉద్యమకారుల అరెస్టులు
సెక్రటేరియట్ వద్ద ఉద్రిక్తత.. ఉద్యమకారుల అరెస్టులు

→ ఎడ్ల మహేష్ కుమార్ - రిపోర్టర్