హోమ్ హైదరాబాద్‌ జాతీయం అంతర్జాతీయం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ క్రీడలు ఎడ్యుకేషన్ & కెరీర్‌ బిజినెస్ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ క్రైమ్‌ సంపద వ్యవసాయం సినిమా ఈ-పేపర్
పోస్టాఫీస్ లొ దొంగతనానికి యత్నించిన భార్య భర్తలను పోలీసులు అరెస్ట్ JH-17973

జనహితం న్యూస్, బాన్సువాడ: కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని పోలీస్ స్టేషన్ కు కూతవేటు దూరంలోని పోస్టాఫీస్ లొ దొంగతనానికి యత్నించిన భార్య భర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు.

బాన్సువాడ డీఎస్పీ విఠల్ రెడ్డి శనివారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో తెలిపిన వివరాల ప్రకారం ఎల్లారెడ్డి పట్టణంలోని లోద్ధిగల్లి కి చెందిన కురుమ శివకుమార్, కురుమ లావణ్య లు భార్య భర్తలు. ఈ నెల 13న రాత్రి సమయంలో పోస్టాఫీస్ లోకి ప్రవేశించి దొంగతనానికి ప్రయత్నించారు. వాచ్ మెన్ సాయిలుపై దాడి చేసి అతని వద్ద రూ.1000, ఓ సెల్ ఫోన్ దొంగలించినట్లు వెల్లడించారు. పోస్టాఫీస్ లో ఉన్న మరో రెండు సెల్ ఫోన్ లను కూడా చోరి చేశారు.

బాన్సువాడ పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి మూడు రోజుల్లోనే వారిని అరెస్టు చేసి వారి వద్ద నుంచి మూడు సెల్ ఫోన్ లు, రూ.1000 నగదును స్వాధీనం చేసుకున్నారు. భార్య భర్తలు హైదరాబాద్ జేబిఎస్ వద్ద ఉన్న గుడిలో హుండి పగుల గొట్టి దొంగలించారు. బస్ స్టాండ్ లో సెల్ ఫోన్ లను చోరి చేశారు. వాటిని కుడా స్వాధీనం చేసుకున్నారు. ఈ చోరి కేసును చేదించిన బాన్సువాడ సిఐ శ్రీధర్, క్రైం పార్టీతో పాటు సిసిఎస్ సిబ్బందికి కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర రివార్డు ప్రకటించారు.

Click to join Whatsapp channel
Janahitham News
పోస్టాఫీస్ లొ దొంగతనానికి యత్నించిన భార్య భర్తలను పోలీసులు అరెస్ట్
పోస్టాఫీస్ లొ దొంగతనానికి యత్నించిన భార్య భర్తలను పోలీసులు అరెస్ట్

→ ఎడ్ల మహేష్ కుమార్ - రిపోర్టర్