హోమ్ హైదరాబాద్‌ జాతీయం అంతర్జాతీయం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ క్రీడలు ఎడ్యుకేషన్ & కెరీర్‌ బిజినెస్ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ క్రైమ్‌ సంపద వ్యవసాయం సినిమా ఈ-పేపర్
సింగూర్ నీరు విడుదల.. రైతులకు ఊరట - ఫలించిన పద్మ దేవేందర్ రెడ్డి కృషి JH-18871

జనహితం న్యూస్, మెదక్ రూరల్: నేడు సింగూర్ ప్రాజెక్టు నుంచి ఘనపురం ఆయాకట్టకు సాగునీరు విడుదల కావడంతో ప్రాంత రైతులకు ఊరట లభించింది. పంటలు కీలక దశలో ఉండటంతో నీటి కోసం ఎదురుచూస్తున్న రైతులు ఆనందం వ్యక్తం చేశారు.

మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మ దేవేందర్ రెడ్డి రైతులతో కలిసి జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించి సాగునీరు అందించాలని కోరారు. ఇదే సమస్యను అసెంబ్లీలో నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి, మాజీ మంత్రి హరీష్ రావు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు. ఇదే సమస్యను పద్మ దేవేందర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే శశిధర్ రెడ్డి, రైతులతో కలిసి హెచ్ఆర్సీని ఆశ్రయించారు. పంటల పరిస్థితిని పరిగణలోకి తీసుకున్న హెచ్ఆర్సీ కమిషనర్ వెంటనే సాగునీరు విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో సింగూర్ ప్రాజెక్టు నుంచి నీటి విడుదల జరిగింది.

ఈ సందర్భంగా రైతులు పద్మ దేవేందర్ రెడ్డి, శశిధర్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. రైతుల పక్షాన బిఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ పోరాటం చేస్తుందని పద్మా దేవేందర్ రెడ్డి పేర్కొన్నారు.

Click to join Whatsapp channel
Janahitham News
సింగూర్ నీరు విడుదల.. రైతులకు ఊరట - ఫలించిన పద్మ దేవేందర్ రెడ్డి కృషి
సింగూర్ నీరు విడుదల.. రైతులకు ఊరట - ఫలించిన పద్మ దేవేందర్ రెడ్డి కృషి

→ మల్లీశెట్టి రవి - రిపోర్టర్‌