హోమ్ హైదరాబాద్‌ జాతీయం అంతర్జాతీయం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ క్రీడలు ఎడ్యుకేషన్ & కెరీర్‌ బిజినెస్ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ క్రైమ్‌ సంపద వ్యవసాయం సినిమా ఈ-పేపర్
శుభకార్యాల్లో పాల్గొంటూ ప్రజలకు చేరువైన ఏలే మల్లికార్జున్ JH-25227

జనహితం న్యూస్, కామారెడ్డి: నిజాంసాగర్ ఉమ్మడి మండలంలో ఈరోజు నిర్వహించిన పలు శుభకార్యాల్లో కామారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ పాల్గొని ప్రజలతో సన్నిహితంగా మమేకమయ్యారు. వివిధ కార్యక్రమాల్లో హాజరవుతూ, కుటుంబాలకు శుభాకాంక్షలు తెలియజేశారు. మహమ్మద్ నగర్ మండలంలోని నర్వ గ్రామంలో జరిగిన ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొని గృహ యజమానులను అభినందించిన ఆయన, వారి కొత్త గృహంలో సుఖసంతోషాలు నిండాలని ఆకాంక్షించారు.

అనంతరం కాంగ్రెస్ పార్టీ కార్యకర్త భూమేష్ కుమారుల పుట్టుపంచల కార్యక్రమంలో పాల్గొని ఆశీర్వదించారు. తదుపరి బంజపల్లి గ్రామంలో జరిగిన మాజీ ఉప సర్పంచ్ లింగా గౌడ్ మనవరాలి మొదటి పుట్టినరోజు వేడుకలో పాల్గొని చిన్నారిని ఆశీర్వదించారు. కుటుంబ సభ్యులతో స్నేహపూర్వకంగా ముచ్చటిస్తూ వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమాంలో మహమ్మద్ నగర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, స్థానిక సర్పంచులు, ఉప సర్పంచ్లు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకలను ఘనంగా నిర్వహించారు.

Click to join Whatsapp channel
Janahitham News
శుభకార్యాల్లో పాల్గొంటూ ప్రజలకు చేరువైన ఏలే మల్లికార్జున్
శుభకార్యాల్లో పాల్గొంటూ ప్రజలకు చేరువైన ఏలే మల్లికార్జున్

→ ఎడ్ల మహేష్ కుమార్ - రిపోర్టర్