సాంగ్లీలో కాంగ్రెస్ కీలక ప్రక్రియ.. తోట లక్ష్మీకాంతారావు సంచలన వ్యాఖ్యలు!
Published on 15 Apr 2026, 07:47 PM 101
JH-68194
జనహితం న్యూస్, కామారెడ్డి: డీసీసీ అధ్యక్షుల ఎంపిక ప్రక్రియ కోసం ఏఐసీసీ 'సంఘటన్ సృజన్ అభియాన్ ' కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లా డీసీసీ అధ్యక్షుడి ఎంపికకై ఏఐసీసీ పరిశీలకులుగా జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు నియమితులయ్యారు. డీసీసీ ప్రెసిడెంట్ ఎంపిక ప్రక్రియలో భాగంగా ఈరోజు సాంగ్లీ జిల్లాకు చేరుకున్న ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు స్థానిక జిల్లా నాయకులు, కార్యకర్తలు పుష్ప గుచ్చాలు అందజేసి ఘన స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం పార్టీ నాయకులు, కార్యకర్తలను ఉద్దేశిస్తూ ఎమ్మెల్యే ప్రసంగించారు. కాంగ్రెస్ పార్టీ సంస్థాగత పునర్నిర్మాణంలో భాగంగా డీసీసీ అధ్యక్షుల నియామక ప్రక్రియ ప్రారంభమయిందని, పార్టీ బలోపేతం కోసం పాటుపడే వ్యక్తిని అధ్యక్షుడిగా ఎంపిక చేయడం జరుగుతుందని తెలిపారు. జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవికి ఆసక్తి గల అభ్యర్థులు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు.
డీసీసీ అధ్యక్షుడి ఎంపిక పూర్తి పారదర్శకంగా, నాయకుల, కార్యకర్తల యొక్క అభిప్రాయాలను మరియు అన్ని అంశాలను పరిగణలోకి తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియలో పార్టీ కార్యకర్తలు, నాయకులు పాల్గొని సహకరించాలని కోరారు. స్థానిక నాయకుల, కార్యకర్తల యొక్క అభిప్రాయాలను అధిష్టానానికి పంపి డీసీసీ పదవికి సిఫారసు చేయడం జరుగుతుందని అన్నారు. పార్టీ అధిష్టానం డీసీసీ అధ్యక్షుడి నియామకంపై తుది నిర్ణయం తీసుకుంటుందని తెలియజేశారు.పార్టీ అంతర్గత ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేస్తూ నాయకత్వాన్ని కార్యకర్తల ద్వారానే ఎంపిక చేయడం,పార్టీ భవిష్యత్తుకు దిశానిర్దేశం చేసే ఒక మంచి ప్రక్రియ అని అన్నారు.
ఈ విధానం ద్వారా గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు నాయకత్వాన్ని కార్యకర్తల అభిప్రాయాల ఆధారంగా ఎంపిక చేయడం వల్ల పార్టీ సంస్థాగత నిర్మాణం మరింత బలపడటానికి దోహదం చేస్తుంది అని అభిప్రాయం వ్యక్తం చేశారు. అనంతరం అభ్యర్థులకు దరఖాస్తు పత్రాలను అందజేశారు. ఈ సమావేశంలో ఎంపీ ప్రణితి షిండే, ఎంపీ విశాల్ పాటిల్, మాజీ మంత్రి ఎమ్మెల్యే విశ్వజిత్ కదమ్, పూణే మున్సిపల్ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్, మాజీ ఎమ్మెల్యే దీప్తి చవాన్ తదితరులు పాల్గొన్నారు.
